
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై సీఎం ఏక్ నాథ్ షిండే విమర్శలు గుప్పించారు. తన గతాన్ని ప్రస్తావిస్తూ ఉద్ధవ్ పై విరుచుకపడ్డారు. ‘‘ఆటోరిక్షా మెర్సిడెస్ కారును మించిపోయింది.. ఎందుకంటే ఇది సామాన్యుల ప్రభుత్వం’’ అంటూ షిండే ట్వీట్ చేశారు. ప్రతి వర్గాన్ని గౌరవిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. కాగా తిరుగుబాటు చేస్తున్న సమయంలో ఏక్ నాథ్ షిండేను శివసేన నాయకులు ఆటో రిక్షా డ్రైవర్ అంటూ హేళన చేశారు. మొదట్లో జీవనొపాధి కోసం షిండే ఆటో నడిపారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్ కు తన రాజీనామాను సమర్పించేందుకు రాజ్ భవన్ కు మెర్సిడెస్ కారులోనే వెళ్లారు.
रिक्षाच्या स्पीडपुढे मर्सिडीजचा स्पीड फिका पडला.. कारण हे सर्वसामान्यांचं सरकार!!#MaharashtraFirst
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) July 5, 2022
గతంలో కూడా ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రేపై డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. 1990లో అయోధ్య రామమందిరం కోసం జరిగిన ఆందోళనలో పాల్గొన్న కరసేవకులను అభినందించలేని ఆదిత్య ఠాక్రేను మెర్సిడెస్ బేబీ అంటూ ఫడ్నవీస్ విమర్శించారు. కాగా బీజేపీ మద్ధతుతో జూన్ 30న షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు అసెంబ్లీలో 164మంది ఎమ్మెల్యేలు మద్ధతు పలికారు.