అవాంటెల్కు భారీ ఆర్డర్

అవాంటెల్కు భారీ ఆర్డర్

హైదరాబాద్​, వెలుగు: కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ అవాంటెల్ లిమిటెడ్​కు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్​) నుంచి అవాంటెల్​కు రూ.17.7 కోట్ల విలువైన కొనుగోలు ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ ప్రకారం, అవాంటెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌‌కు అత్యాధునికమైన హై-ఫ్రీక్వెన్సీ (హెచ్​ఎఫ్) సాఫ్ట్‌‌వేర్ డిఫైన్డ్ రేడియో (ఎస్​డీఆర్)లను సరఫరా చేయనుంది. ఈ రేడియోలు కమ్యూనికేషన్ రంగంలో కీలకపాత్ర పోషిస్తాయి. రక్షణశాఖ వివిధ అప్లికేషన్లలో వీటిని వాడుతుందని అవాంటెల్​ తెలిపింది.