కనెక్ట్ అయ్యే కంటెంట్‌‌‌‌తో..

కనెక్ట్ అయ్యే కంటెంట్‌‌‌‌తో..

బెల్లంకొండ గణేష్ హీరోగా రాకేష్‌‌‌‌ ఉప్పలపాటి దర్శకత్వంలో సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. బాలీవుడ్ హీరోయిన్‌‌‌‌ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్‌‌‌‌గా నటించింది. జూన్ 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా అవంతిక దస్సాని ఇలా ముచ్చటించింది. ‘తెలుగులో హీరోయిన్‌‌‌‌గా పరిచయమవడం చాలా ఎక్సయిటెడ్‌‌‌‌గా ఉంది. శ్రుతి అనే పాత్రలో కాలేజ్ అమ్మాయిగా కనిపిస్తా. హీరో జీవితాన్ని శ్రుతి, ఒక ఫోన్ ఎలా మార్చేశాయనేది కాన్సెప్ట్‌‌‌‌. అందరికీ కనెక్ట్ అయ్యే కథ. అలాగే ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుంది. కామెడీ, రొమాన్స్, థ్రిల్, యాక్షన్ లాంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.

నా కథల ఎంపికలో అమ్మ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు. కానీ నేను తన సలహాలు తీసుకుంటా. హిందీ ‘ఛత్రపతి’లో నటించిన అమ్మ.. ఆ మూవీ షూటింగ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో ఈ స్టోరీ విని, నాకు బాగుంటుందని చెప్పడంతో నేనీ ప్రాజెక్ట్‌‌‌‌లోకి వచ్చాను. నాకు ఏం కావాలో, ఏది బావుంటుందో  తనకి బాగా తెలుసు. సౌత్ ఇండస్ట్రీ అంటే అమ్మకు చాలా ఇష్టం, గౌరవం. నేనూ తెలుగు సినిమాలు చూస్తుంటాను. నయనతార, సమంత అంటే ఇష్టం. పుష్ప, అల వైకుంఠపురములో చిత్రాల్లో అల్లు అర్జున్ గొప్పగా నటించారు. నేను గతంలో నటించిన ‘మిథ్యా’ వెబ్ సిరీస్‌‌‌‌ సీజన్‌‌‌‌ 2 వస్తోంది. అలాగే ‘యు షేప్‌‌‌‌ కి గల్లీ’ మూవీ షూటింగ్ పూర్తయింది’ అని చెప్పింది.