
సినిమా... చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఒక కాలక్షేపం. చాలా మదికి సినిమా పిచ్చి.. వీకెండ్ ఎప్పుడొస్తుందా.. కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. వారం వారం థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసేవారు చాలా మంది ఉంటారు. అయితే, ఈ సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గటానికి ఓటీటీల ట్రెండ్ పెరగటం, సినిమా కథ, కథనాల్లో లో క్వాలిటీ తగ్గటం లాంటి కారణాలు పక్కన పెడితే.. టికెట్ ధరలు పెరగటం, మల్టీప్లెక్స్ లలో ఫుడ్ అండ్ బివేరేజెస్ పై దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోవడం ప్రధాన కారణమని చెప్పచ్చు.
ఇదే అంశంపై బాలీవుడ్ ఫిలిం మేజర్ కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ టికెట్ ధరలు, ఫుడ్ అండ్ బివరేజెస్ ధరల గురించి మాట్లాడుతూ సగటు ప్రేక్షకుడు తమ సినిమా ఔటింగ్లను ఏడాదికి రెండుసార్లకు తగ్గించారంటూ ఓ సర్వే గురించి ప్రస్తావించారు. నలుగురితో కూడిన ఫ్యామిలీ సినిమాకెళ్లాలంటే సగటు ఖర్చు రూ.10వేల వరకు అవుతుందని అన్నారు కరణ్. థియేటర్లో టికెట్ ధరలకంటే అధికంగా ఫుడ్ అండ్ బివరేజెస్ ధరలు ఉండటమే ఇందుకు కారణమని అన్నారు.
Also Read :- నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ
దీపావళి లాంటి పండుగల సమయంలో లేదా స్త్రీ2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే తప్ప సగటు ప్రేక్షకుడు థియేటర్ వైపు చూడటం లేదని అన్నారు కరణ్. సినిమా ఖర్చు భరించేంత స్తొమత సగటు ప్రేక్షకుడికి లేకపోవటమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు కరణ్.