ఇకపై హారర్ సినిమాల్లో..అవకాశాలొస్తాయి

ఇకపై హారర్ సినిమాల్లో..అవకాశాలొస్తాయి

‘‘ మహేష్ భట్, విక్రమ్ భట్ లాంటి  లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌‌‌‌తో వర్క్ చేయడం అనేది నా  కల. అది ఇంత త్వరగా నెరవేరడం నా అదృష్టం. ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇదొక యూనిక్ హారర్ సినిమా. నాకు హారర్ సినిమాలు చూడటం ఇష్టమే.. కానీ భయపడుతూ చూస్తాను(నవ్వుతూ). ఇలాంటి జానర్ చేయడం నాకిది ఫస్ట్ టైమ్.  గతంలో ‘రాజుగారి గది3’లో నటించినప్పటికీ అది హారర్ కామెడీ మూవీ. ఇది మాత్రం సీరియస్ హారర్ ఫిల్మ్. అలాగే ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కూడా ఉన్నాయి. టెక్నికల్‌‌‌‌గా చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఈ సినిమా తర్వాత కచ్చితంగా మరిన్ని హారర్ కథల కోసం నన్ను సంప్రదిస్తారని అనుకుంటున్నా.  నాగార్జున గారు నా మొదటి సినిమా నుంచీ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు.  ఆయన నా లక్కీ చార్మ్. మొన్న నన్ను పాన్ వరల్డ్ స్టార్ అని అన్నారు. ప్రేమ, ఆప్యాయతతో చెప్పిన మాట అది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక నేను నటించిన ‘ఇందు’అనే వెబ్ సిరీస్ త్వరలోనే వస్తుంది. అలాగే ఆది సాయి కుమార్ తో ‘అమరన్’ మొదలవబోతోంది’’.