హైదరాబాద్, వెలుగు: వైఎస్వివేకానంద రెడ్డి హత్య కేసులో మంగ ళవారం కీలక పరిణామం చోటుచేసు కుంది. ఈ కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కడప వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు పలుసార్లు హాజరై వివరణ ఇచ్చానని, సీబీఐ తనను అరెస్టు చేయాల్సిన అవసరం లేనందునే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నానని చెప్పారు. ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.
