ఉద్యోగం చేస్తున్నారా? అయితే సెలవు తీసుకోండి

ఉద్యోగం చేస్తున్నారా? అయితే సెలవు తీసుకోండి

 డే ఆఫ్​లు, సండేలు వచ్చిన తెల్లారి తప్పదు అన్నట్టు  ఉద్యోగానికి వెళ్తుంటారు కొందరు.   ఇలాంటి ఒత్తిడి ఎప్పుడో ఒకప్పుడు అందరికీ వచ్చేదే. అలాంటి వాళ్లు ‘అకేషనల్​ లీవ్స్​’ తీసుకోవాలి అంటున్నారు సైకాలజిస్టులు.  పైగా ఇలా సెలవు తీసుకుంటే పనిచేసే ఇంట్రెస్ట్​ పెరుగుతుందట. మెంటల్​ హెల్త్​కు, ఫిజికల్​ హెల్త్​కు చాలా గట్టి రిలేషన్​ ఉంటుంది.  బాడీ కరెక్ట్​గా సహకరిస్తేనే మైండ్​ పని చేస్తుంది. మైండ్​ కూల్​గా ఉంటేనే పని చేయాలన్న ఇంట్రెస్ట్​ వస్తుంది. సరిగ్గా నిద్రపోవడం, ఫ్రెండ్స్​తో మాట్లాడటం, ఎక్సర్​సైజ్​ చేయడం వంటివి లేకపోతే మెంటల్​ హెల్త్​- దెబ్బ తింటుంది. అందుకే అకేషనల్​గా లీవ్ పెట్టి రిలాక్స్​ అవ్వాలంటున్నారు.  అకేషనల్​ లీవ్​ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, ఆనందం పెరుగుతుంది. దీనివల్ల ప్రొడక్టివిటీ  పెరుగుతుంది. హెల్త్​ బాగుంటుంది. నెగెటివ్​ ఆలోచనలు రావని ప్రపంచ ఆరోగ్యసంస్థ 2019లో చెప్పింది. పని నుంచి అకేషనల్​గా లీవ్స్​ తీసుకుంటే ఎంప్లాయిస్​ తమ పర్సనల్​  విషయాలమీద  ఫోకస్​ చేయగలుగుతారు. ప్రొఫెషనల్​గా, 
పర్సనల్​గా ఎంజాయ్​ చేయగలుగుతారు.