సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి ..భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు

సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి ..భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు

ఇల్లెందు, వెలుగు : ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కల్పించాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. శుక్రవారం ఇల్లెందు డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పెండింగ్​లో ఉన్న  కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

సబ్ డివిజన్​లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు జరగకుండా ప్రతీ ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. బాధితులకు అండగా ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, ఇల్లెందు, టేకులపల్లి సీఐలు సురేశ్, సత్యనారాయణ,  సబ్ డివిజన్​ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.