
బోధన్, వెలుగు: బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్ లో ఆర్టీవో, ట్రాఫిక్ శాఖలు సంయుక్తంగా స్కూల్బస్సుల డ్రైవర్లు, స్కూల్ ఓనర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీటీవో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బాధ్యతాయుతంగా స్కూల్ బస్సులు నడిపించాలన్నారు. అనుకోకుండా ప్రమాదాలు జరిగేతే తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చారు.
ట్రాఫిక్ నియమనిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. అనంతరం ఇంట్లో గ్యాస్ సిలిండర్ల ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, అగ్నిమాపక అధికారి సుభాష్, ట్రాఫిక్ పట్టణ సీఐ చందర్ రాథోడ్, ఇందూర్ కరస్పాండెంట్ కొడాలి కిశోర్, స్కూల్ ఓనర్లు , డ్రైవర్లు పాల్గొన్నారు.