వ్యాపారుల కోసం యాక్సిస్ ​మర్చంట్ ​యాప్​

వ్యాపారుల కోసం యాక్సిస్ ​మర్చంట్ ​యాప్​

హైదరాబాద్​, వెలుగు:  వీసా,  మింటోక్ భాగస్వామ్యంతో వ్యాపారుల కోసం నియో ఫర్​ మర్చంట్​  యాప్​ను ప్రారంభించినట్లు  యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. సులభమైన యూజర్​ఇంటర్​ఫేస్​, అన్ని రకాల పేమెంట్ల స్వీకరణ, వ్యాపార ఖర్చుల సమాచారం ఇవ్వడం నియో మర్చంట్​​యాప్​ ప్రత్యేకతలు. ట్రాన్సాక్షన్​ రిపోర్టులను కూడా చూడవచ్చు.  

 కార్డులు, యూపీఐ, ఎస్​ఎంఎస్​ పే ద్వారా డబ్బు తీసుకోవచ్చు.   ఏదైనా సమస్య వస్తే నేరుగా యాప్ ​ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. లోన్​ కోసం కూడా దరఖాస్తు చేయవచ్చని  యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.