50 మందిపై వేటు వేసిన యాక్సిస్ బ్యాంక్

50 మందిపై వేటు వేసిన యాక్సిస్ బ్యాంక్

కొత్త సీఈఓ నిర్ణయం

న్యూఢిల్లీ :యాక్సిస్ బ్యాంక్‌ లో 50 మందికి  పైగా మిడ్ లెవల్ మేనేజర్లపై వేటు పడింది . కొత్త సీఈఓ వచ్చీ రావడంతోనే ఖర్చుల కోత, వ్యా పారాల మార్పుల్లో భాగంగా మేనేజర్లపై యాక్సిస్ బ్యాంక్ వేటు వేసినట్టు తెలిసింది . తీసేసిన వారిలో కార్పొరేట్, రిటైల్ బ్యాంకింగ్‌ లో పలు సూపర్‌ వైజరీ ఫంక్షన్స్ నిర్వహించే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు , వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు. యాక్సిస్ కొత్త సీఈవోగా అమితాబ్ చౌదరి 2019 జనవరి 1నుంచి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బ్యాంక్ వ్యాపారాలను సమీక్షిస్తోన్న కొత్త సీఈవో, ఈ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వీరికి బ్యాంక్‌ లో మరే ఇతర సరిపోయే ఉద్యోగాలు లేకపోవడంతో వేటు వేసినట్టు తెలిసింది . ఈ మిడ్ లెవల్ మేనేజర్లను వేరే ఉద్యోగాలు చూసుకో మని బ్యాంక్‌ ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంక్ సామర్థ్యాన్ని పెంచేందుకే మార్పులు జరుగుతున్నాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది . కానీ ఉద్యోగుల సంఖ్య తగ్గింపు దీనిలో భాగం కాదని పేర్కొంది .‘ఈ ప్రక్రియలో భాగంగా కొంతమంది ఉద్యోగులు ముందస్తు పదవీ విరమణను ఎంపిక చేసుకున్నారు. ఉద్యోగుల సంఖ్య తగ్గించే ప్లా న్స్‌ ఏమీ లేవు’ అని బ్యాంక్ తెలిపింది . చౌదరి బ్యాంక్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించాక, ఆపరేషన్స్ కోసం సరికొత్త బిజినెస్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. అంతేకాక కొత్త ఉద్యోగులను తీసుకొస్తున్నారు. ఆర్గనైజేషన్ రూపురేఖలను మారుస్తున్నారు.