యాక్సిస్ ఫైనాన్స్ నుంచి మైక్రో లోన్లు

యాక్సిస్ ఫైనాన్స్ నుంచి మైక్రో లోన్లు

యాక్సిస్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఏఎఫ్ఎల్) ధనత్రయోదశి సందర్భంగా,  శక్తి పేరుతో మైక్రో లోన్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.  చిన్న వ్యాపారవేత్తలు, వర్తకులు, స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ల వ్యాపార, వ్యక్తిగత అవసరాల కోసం ఈ లోన్​ఇస్తారు. తక్కువ డాక్యుమెంటేషన్, వేగంగా లోన్​జారీ, రకరకాల రీపేమెంట్​ ఆప్షన్లు శక్తి లోన్ల ప్రత్యేకతలు. రూ. 75 లక్షల వరకు లోన్​ ఇస్తామని యాక్సిస్​తెలిపింది. చాలా రకాల ఆస్తులను తాకట్టు పెట్టడానికి అనుమతిస్తామని పేర్కొంది.

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కేలర్ భాగస్వామ్యం విస్తరణ

గ్లోబల్​ టెక్​ కంపెనీ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్, క్లౌడ్ సెక్యూరిటీ సొల్యూషన్స్​  ప్రొవైడర్  ​జెడ్​స్కేలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఐ-ఆధారిత నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్,  మెరుగైన జీరో-ట్రస్ట్ సెక్యూరిటీ సేవలను అందించడానికి తమ భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త భాగస్వామ్యంలో, జడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కేలర్ జీరో ట్రస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్​ను హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఫ్యూజన్ సెంటర్ (సీఎస్ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలిపారు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ యూనివర్సల్ ఎండీఆర్ సేవలు కూడా జడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కేలర్ భాగాలతో అనుసంధానమయ్యాయి.