ఇంటర్ బోర్డు సీఓఈగా జయప్రద బాయి

ఇంటర్ బోర్డు సీఓఈగా జయప్రద బాయి

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు పూర్తిస్థాయి ఎగ్జామినేషన్ కంట్రోలర్​(సీఓఈ)గా జయప్రద బాయి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం వరంగల్ ఆర్జేడీగా ఉన్న ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. మరోపక్క హన్మకొండ డీఐఈఓ గోపాల్​కు వరంగల్ ఆర్జేడీగా ఇన్​చార్జ్ బాధ్యతలు అప్పగించారు.