శ్రీ వెంకట్ ధూళిపాళ రచించిన ‘Creating a New Medina’ అనే గ్రంథంలో పాకిస్తాన్ సృష్టి చరిత్ర, దాని లక్ష్యాలు వివరించారు. అలాగే జియా పాలనా కాలంలో పాకిస్తాన్ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 2A ఉద్దేశ్యం..ఈ రెండింటిని కలిపి చూస్తే మనకు ఒక విషయం అవగతమవుతుంది.
2024 జనవరి 22న అయోధ్యలో జరిగిన పవిత్ర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామ లల్లా స్వయంగా అవతరించిన సంఘటనకు ఉన్న లోతైన రాజ్యాంగ, సాంస్కృతిక ప్రాముఖ్యత అర్థం అవుతుంది. ఆర్టికల్ 363 వివాద ఫలితం ఏం సూచిస్తున్నదంటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 పవిత్ర ఉద్దేశ్యం, మూల రాజ్యాంగంలో ఉన్న శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి చిత్రంతో ప్రతీకాత్మకంగా ప్రతిబింబించినదని తెలియజేస్తుంది.
ఇది పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2A ఉద్దేశ్యాన్ని ఓడించడమే. 1947 జనవరి 22 నాటికి ఉన్న విభజనకు గురికాని ప్రాచీన భూమి న్యాయ, సాంస్కృతిక స్థితిని అమలుచేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ స్థానం నేరుగా 1947 జనవరి 22న ఆమోదించిన రాజ్యాంగ సభ లక్ష్యాల తీర్మానం నుంచి ఉద్భవించింది. ఆ తీర్మానం రామరాజ్య సూత్రాలను, ధర్మమే రాజులకు రాజు (ధర్మం క్షత్రస్య క్షత్రం) అని తెలుపుతుంది.
సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు
ఈ సూత్రాలను 1947 జులై 22న ఇచ్చిన ప్రభుత్వ హామీతో కలిపి చదవాలి. ఆ హామీ ప్రకారం ప్రతి వ్యక్తికి తన విధానంలో ఆరాధించుకునే హక్కు, తన భాష,
సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కల్పించడమైనది. ఈ రెండూ సమన్వయంగా చదివితే, రాజ్యాంగ నిర్మాణాధికారంపై ఒక న్యాయ పరిమితిని విధిస్తాయి. ఆర్టికల్ 26ను ఆర్టికల్ 363తో కలిపి అమలు చేయాల్సినవిధంగా ప్రభావం చూపుతాయి.
దేవతా హక్కులను గుర్తిస్తూ.. ముఖ్యంగా ఇదే స్థితి 1949 ఆగస్టు 15 నుంచే మునుపటి రాజ్యాంగ వ్యవస్థలోనూ ఉంది. ట్రావంకోర్ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంగీకరించినప్పుడు, అమలు బాధ్యతను భక్తిశ్రద్ధగల తిరుప్పాణ్ ఆల్వార్ అమ్మాళ్ (SC/ST) సముదాయానికి ప్రత్యేకంగా అప్పగించడం జరిగింది. ఇది దేవతారాధన పట్ల రాజ్యాంగ బాధ్యత నిరంతరంగా కొనసాగుతున్నదని స్పష్టంగా సూచిస్తోంది. మొత్తంగా ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.. శ్రీరామునికి సంబంధించిన ప్రాచీన పవిత్ర భూమి ధార్మిక స్వరూపాన్ని పరిరక్షించడమే.
ఆ పవిత్రత దేవతారాధన నిరంతరతపై ఆధారపడి ఉంటుంది. ఈ రాజ్యాంగ బాధ్యత పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2A ఉద్దేశ్యానికి ప్రత్యక్షంగా వ్యతిరేకంగా నిలిచి దానిని ఓడిస్తుంది. పాకిస్తాన్ సృష్టి వెనుక ఉన్న చారిత్రక ఉద్దేశ్యాన్ని ‘Creating a New Medina’ గ్రంథం పరిచయంలో పేర్కొన్న జిన్నా వ్యాఖ్య స్పష్టంగా, సంక్షిప్తంగా తెలియజేస్తోంది.
ఆ వ్యాఖ్య ‘మసీదు కోసం భూమిని ముందుగా సురక్షితం చేయాలనుకుంటున్నాను. ఒకసారి ఆ భూమి మనదైతే ఆ తర్వాత మసీదును ఎలా నిర్మించాలన్నది మనమే నిర్ణయిస్తాం’ అని తెలుపుతోంది. ఈ గ్రంథంలో సమర్పించిన విస్తృతమైన చారిత్రక సమాచారం ఈ ఉద్దేశ్యాన్ని బలంగా సమర్థిస్తోంది. ఈ నేపథ్యమే పాకిస్తాన్ రాజ్యాంగాన్ని సరిగా అర్థం చేసుకునేందుకు దోహదపడుతుంది.
పాకిస్తాన్ రాజ్యాంగంలోని ముఖ్యమైన నిబంధనలు
ఆర్టికల్ 2 ప్రకారం ఇస్లాం పాకిస్తాన్ రాష్ట్ర మతంగా ప్రకటించడమైనది. ఆర్టికల్ 2A జియా పాలనలో చేర్చడం జరిగింది. ఇందులో అనుబంధంలో పొందుపరిచిన ‘Objectives Resolution ’లోని సూత్రాలు, నిబంధనలు రాజ్యాంగంలో అంతర్భాగంగా మారి తగినవిధంగా అమలులోకి వస్తాయని పేర్కొనడమైనది. ప్రారంభంలో పాకిస్తాన్ రాజ్యాంగ సభ ‘Objectives Resolution’ ఈ విధంగా ఉంది. ‘సమస్త విశ్వంపై సార్వభౌమాధికారం పరమేశ్వరుడైన దేవునికే చెందుతుంది.
ఆయన ప్రజల ద్వారా పాకిస్తాన్ రాష్ట్రానికి అప్పగించిన అధికారం, ఆయన విధించిన పరిమితులలో వినియోగించవలసిన పవిత్ర విశ్వాసం. ఆ తరువాత ‘God’ అనే పదాన్ని ‘Almighty Allah’గా మార్చారు.
సమస్త విశ్వంపై సార్వభౌమాధికారం సర్వశక్తిమంతుడైన అల్లాకే చెందుతుంది. ఆయన ప్రజల ద్వారా పాకిస్తాన్ రాష్ట్రానికి అప్పగించిన అధికారం, ఆయన విధించిన పరిమితులలో వినియోగించవలసిన పవిత్ర విశ్వాసం... సారాంశంగా చూస్తే ఆర్టికల్ 2A పాకిస్తాన్ సృష్టి మౌలిక లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.
పైగా జిన్నా మాటల్లో వెల్లడైనట్లుగా రాజ్యాంగతర్కం స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 2Aను మిగిలిన ప్రాచీన భూములపై విస్తరింపజేయడం ద్వారా శ్రీరాముని దేవతా స్వరూపాన్ని నిర్మూలించడమే లక్ష్యం.
ఈ నేపథ్యంలోని దృష్టిలోనే అన్ని మతాల దేవతల అంగీకారాన్ని కలిగి ఉన్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26, ఆర్టికల్ 363లను అమలు చేయడానికిగల రాజ్యాంగ, ధార్మిక, ఆధ్యాత్మిక, నాగరికత ప్రాముఖ్యతను, 2024 జనవరి 22న జరిగిన సంఘటనలను సూక్ష్మంగా అవగాహన చేసుకొని తగిన సవరణాత్మక చర్యలు తీసుకోవలసి ఉంది.
- రంగరాజన్ ఎస్. చిల్కూర్
