అయోధ్య కాంతులు విశ్వమంతా : 24 లక్షల దీపాలతో దీపావళి

అయోధ్య కాంతులు విశ్వమంతా : 24 లక్షల దీపాలతో దీపావళి

అయోధ్య నగరం దీపోత్సవానికి ముస్తాబవుతోంది. దీపావళి పండగ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది కూడా అయోధ్య  నగరంత పాటు..సరయూ నది తీరంలో దీపోత్సవం వేడుకలను యోగీ సర్కారు నిర్వహించనుంది. నవంబర్ 11వ తేదీన అయోధ్యలో దీపోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 24 లక్షల దీపాలు వెలిగించనున్నారు. 

నవంబర్ 11వ తేదీన సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైరిపై 24 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ దీపోత్సవంలో  అయోధ్యలో నవంబర్ 11 నుంచి రామ్ కీ పైరీలో ప్రతీ రోజూ గ్రాండ్ లైట్ అండ్ సౌండ్ షో నిర్వహించనున్నారు. ప్రతీ రోజూ రెండు సార్లు ఈ గ్రాండ్ లైట్ అండ్ సౌండ్ షోలు వేయనున్నారు. రూ. 20 కోట్ల వ్యయంతో లైట్ అండ్ సౌండ్ షోలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సరయూ నదికి హారతి ఇచ్చి..అనంతరం ఈ షో మొదలు పెడతారు. ఈ షోలో రామాయణం ఆధారిత సినిమాలను ప్రదర్శిస్తారు. 

Also Read :-రెండు రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు

యోగీ ఆదిత్యనాథ్ సర్కారు వచ్చినప్పటి నుంచి ప్రతీ ఏడాది  దీపావళి సందర్భంగా అయోధ్యలో దీపోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. 2017లో 51 వేలు, 2019లో 4.10 లక్షలు, 2020లో 6 లక్షలు, 2021లో 9 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నీస్ రికార్డు సృష్టించారు. ఇక 2022లో రామ్ కీ పైరీలోని ఘాట్ లలో 17 లక్షలకు పైగా దీపాలు వెలిగించబడ్డాయి.