అయోధ్య రామమందిర దర్శనం .. టైమింగ్స్ ఇవే

అయోధ్య రామమందిర దర్శనం .. టైమింగ్స్ ఇవే

అయోధ్య.. ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ..  ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటాడు. ఈ ఆలయ పనులు ప్రస్తుతం చకచక జరుగుతున్నాయి.  జనవరి 22 న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది.  ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజూ మూడు నుండి ఐదు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు.  ఆలయంలో శ్రీరాముడిని ఎప్పుడెప్పుడు దర్శించుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం.  

సమయాలు:

ఆలయం ప్రతిరోజూ ఉదయం 7 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి తెరిచి ఉంటుంది.  ప్రత్యేక సందర్భాలలో..  పండుగల సమయాలలో టైమింగ్స్ మారవచ్చు. రోజు శ్రీరాముడికి మూడు హారతులుంటాయి.  

  • ఉదయం 6  : 30 గంటలకు శృంగార్  హారతి 
  • మధ్యాహ్నం 12 గంటలకు భోగ్  హారతి 
  • సాయంత్రం 07:30  గంటకు సంధ్యా హారతి 

టిక్కెట్ ధరలు:

భక్తులందరికీ అయోధ్య రామమందిరంలోకి ప్రవేశం ఉచితం. అయితే ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ప్రత్యేక దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలుచేయాల్సి ఉంటుంది.  ఆలయ టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.300 వరకు ఉంటుంది.   శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఇంకా  దర్శనం టిక్కెట్లను విడుదల చేయలేదు. భక్తులందరికీ ఉచిత ప్రసాదం కూడా ఉంటుంది.  

ఆలయంలో రాముడు, సీత, ఆంజనేయు విగ్రహాలతో పాటుగా లక్ష్మణ, భరత,శత్రుఘ్నలను గర్భగుడిలో ప్రతిష్టించారు. మొత్తం ఆలయ 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆలయంలో ఫొటోలు, వీడియోలు నిషేదం. ఆలయం లోపల ఉన్నప్పుడు మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది.  

ఎలా చేరుకోవాలి

ఈ ఆలయానికి చేరుకోవడానికి ప్రధానంగా మూడు మార్గాలున్నాయి.  అయోధ్యలో వాల్మీకి విమానాశ్రయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మధ్యే ప్రధాని మోదీ దీనిని ప్రారంభించారు. ఇక మిగిలినవి రైలు, రోడ్డు మార్గాలు.. అయోధ్య జంక్షన్  రైల్వే స్టేషన్ ను ఇటీవల మోదీ ప్రారంభించారు.  ఇక జాతీయ రహదారుల మార్గం గుండా ఆయోధ్యకు చేరుకోవచ్చు.