శ్రీరాముని పుట్టిన తేది ఎప్పుడో తెలుసా..

శ్రీరాముని పుట్టిన తేది ఎప్పుడో తెలుసా..

శ్రీరాముని ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసు.. మరి.. శ్రీరాముని డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? అయోధ్యలో.. శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు? పురాణాలు చెప్పిందేంటి..? రీసెర్చ్ తేల్చిందేంటి?

శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడని అందరికీ తెలుసు. కానీ.. కచ్చితంగా ఎప్పుడు పుట్టాడన్నది మాత్రం.. ఎవరికీ స్పష్టంగా తెలియదు. చాలా మంది చరిత్రకారులు శ్రీరాముని పుట్టిన తేదీ  గురించి అధ్యయనం చేశారు. రాముడు.. చారిత్రక పురుషుడని.. పాశ్చాత్యులు కూడా నిర్ధారించారు. పురాణాల్లో.. రాజవంశాలను పరిశీలించి.. శ్రీరాముడు మహాభారత యుద్ధం నాటికి.. అతి ప్రాచీనుడని నిర్ధారించారు.

శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5వేల 114లో జనవరి 10వ తేదీన.. మధ్యాహ్నం 12 0.5 గంటలకు  జన్మించినట్లు నిర్ధారించింది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా.. శాస్త్రవేత్తలు రాముడి పుట్టినరోజు గురించి సమయం, సంవత్సరంతో సహా చెప్పగలిగారు.అంటే  శ్రీ రాముడు జన్మించి ఇప్పటికి 7వేల 132 సంవత్సరాలైందన్నమాట.

చైత్రశుద్ధ నవమి.. కర్కాటక లగ్నంలో.. పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడని.. వాల్మీకి రామాయణం చెబుతోంది.
రామాయణంలో వాల్మీకి చెప్పిన వివరాల ఆధారంగా.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అనే సంస్థ.. పరిశోధనలు మొదలుపెట్టింది. ప్లానిటోరియం అనే స్పెషలైజ్డ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి.. కచ్చితమైన కాల నిర్ధారణ చేసి.. శ్రీరాముని జన్మదినానికి సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు..

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సైంటిస్టులు.. అయోధ్యలో రాముడు జన్మించాడని.. రామాయణం నిజంగా జరిగిందని కూడా ఆధారాలు సంపాదించారు. రాముడు భారత భూమిపైనే జన్మించాడని.. అయోధ్య పురవీధుల్లో నడిచాడని.. పరిశోధకులు నిర్ధారించారు. అయోధ్యని.. శ్రీరాముని జన్మస్థానంగా చెప్పబడినా.. ఇక్కడి రామ్ కోట్ వార్డ్  ప్రత్యేక ప్రదేశమే.. శ్రీరాముడి అసలు ప్రదేశం. దీనినే.. రామజన్మభూమిగా పిలుస్తారు. ఇక్కడే.. అప్పట్లో శ్రీరామునికి చిన్న దేవాలయం నిర్మించారు.

వాల్మీకి రామాయణంలో.. శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయానికి ఆయన వయస్సు 25 ఏళ్లుగా తెలిపారు. రాముడు జన్మించిన సమయంలో.. సూర్యుడు మేషరాశిలో.. గురుడు కర్కాటక రాశిలో.. కుజుడు మకరరాశి లో.. శని తులారాశిలో.. శుక్రుడు మీనరాశిలో.. ఉచ్ఛ స్థితిలో కొలువై ఉన్నారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.