ఇది పద్దతేనా : రామ మందిర ప్రారంభోత్సవానికి అద్వానీ, జోషి రావొద్దు

ఇది పద్దతేనా : రామ మందిర ప్రారంభోత్సవానికి అద్వానీ, జోషి రావొద్దు

రామ రామ.. దేశం మొత్తం షాక్ అయ్యే వార్త ఇది.. ఇవాల్టి అయోధ్య అంటే.. అప్పటి బీజేపీ నేతలు ఇద్దరు గుర్తుకొస్తారు. వారిలో ఒకరు ఎల్.కె.అద్వానీ.. మరొకరు మురళీ మనోహర్ జోషి.. అద్వానీ రథయాత్ర ప్రారంభించకపోతే.. అయోధ్య విషయం చాలా మందికి తెలిసి ఉండేది కాదు దేశంలోని చాలా మందికి.. అయోధ్య నుంచి అద్వానీ చేపట్టిన రథయాత్ర.. బీజేపీ పార్టీకి ప్రాణం పోసింది అనొచ్చు.. అలాంటి రామ మందిర నిర్మాణం పూర్తయ్యి.. శ్రీరాముడి ప్రతిష్ట జరుగుతుంటే.. అయోధ్యకు రావొద్దు అంటూ ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఆలయ ట్రస్ట్ చెప్పటం చర్చనీయాంశం అయ్యింది. దీనికి ఆలయ ట్రస్ట్ ఇచ్చిన వివరణ ఇలా ఉంది.. అద్వానీ, జోషి వయస్సు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వాళ్లిద్దరినీ రావొద్దని చెప్పామని.. దానికి వాళ్లు కూడా అంగీకరించారని వెల్లడించారు ట్రస్ట్ ప్రధానాధికారి.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కారణమైన వారిలో  బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ, సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఒకరు. 1990ల్లో రామమందిర ఆందోళనకు నాయకత్వం వహించిన బీజేపీ ప్రముఖులు.. అయితే అయోధ్య  ఆలయ  ప్రారంభోత్సవానికి  వీళ్లను రావొద్దని ..వయస్సు రిత్యా  2024 జనవరిలో  ఆలయ ప్రతిష్టాపన వేడుకకు అయోధ్యకు రావద్దని విజ్ఞప్తి చేసినట్లు    ట్రస్ట్  ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. తమ విజ్ఞప్తిని మన్నించి వారు ఒకే చెప్పారని తెలిపారు. ప్రస్తుతం అద్వానీ వయసు 96..మురళీ మనోహర్ జోషి వయసు 89. మరో వైపు ఆలయ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని దేవెగౌడ (90)ను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఆహ్వానించినట్టు తెలిపారు. 

అయోధ్య రామమందిరం ఉద్యమానికి ఊపిరిలూది.. ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తును మార్చిన వారు అద్వానీ, జోషి, అలాంటిది అయోధ్య ప్రారంభోత్సవానికి రావొద్దని   చెప్పడం.. అంతే   వయసు గల దేవేగౌడను ఆహ్వానించడం విమర్శలకు తావిస్తోంది. 

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని నిర్మిస్తోన్న రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  వచ్చే ఏడాది జనవరి 22న  ఆలయ ప్రతిష్ఠకు ముహూర్తంగా నిర్ణయించారు.  ఈ మహాక్రతువు దేశంలోని వివిధ ప్రాంతాలనుండి  పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.  ఈ క్రమంలో  అయోధ్యకు మొదటి వంద రోజుల్లో 1,000 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.  ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ప్రతిష్ఠ జరిగిన మర్నాడు నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు.