జీడిమెట్ల, వెలుగు: అయ్యప్ప పడిపూజ జరుగుతుండగా.. కోడిగుడ్డు విసిరిన ఇద్దరు వ్యక్తులను సూరారం పోలీసులు అరెస్ట్‌చేశారు. సీఐ సుధీర్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుకానిగూడ గ్రీన్‌ఫీల్డ్ హోమ్స్ కు చెందిన కె.పవన్‌రెడ్డి శనివారం రాత్రి తన ఇంటి ముందు అయ్యప్ప పడిపూజ చేసుకుంటున్నాడు.
ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్డు విసిరారు. తమ మనోభావాలు దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్‌రెడ్డి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు స్థానికులైన తోట ఆదిత్య, గండిమైసమ్మకు చెందిన సురురామ కృష్ణను నిందితులుగా గుర్తించారు. ఆదివారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
