ఆజాద్​ ఎన్కౌంటర్​ కేసు 3 నెలల్లోగా ముగించండి

ఆజాద్​ ఎన్కౌంటర్​ కేసు 3 నెలల్లోగా ముగించండి

మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పోలీసుల వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని ఆదిలాబాద్​ కోర్టును ఆదేశించింది. దీనికి సంబంధించిన విచారణను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. గతంలోకి వెళితే..  హత్య కేసు నమోదుపై ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులు హైకోర్టులో సవాల్​ చేశారు. తమ వాదనలు వినకుండానే ఆదిలాబాద్ జిల్లా కోర్టు నిర్ణయం వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు.  దీంతో పోలీసుల వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా కోర్టుకు హైకోర్టు నిర్దేశించింది.