ఆమనగల్లు, వెలుగు : మాడ్గుల్ మండల కేంద్రంలో టాస్క్ సీవోవో, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న శిబిరంలో 2,200 మంది పాల్గొనగా, అందులో 1,4 86 మందికి కంటి పరీక్షలు చేసి 950 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.
కంటి శుక్లాల ఆపరేషన్ల కోసం 90 మందిని ఎంపిక చేశారు. బుధవారం ఈ శిబిరాన్ని తహసీల్దార్ వినయ్ సాగర్, ఎంపీడీవో విజయలక్ష్మి సందర్శించి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈనెల 29 వరకు కంటి వైద్య శిబిరం కొనసాగుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్యాంపు ఇన్చార్జి జైపాల్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శ్రీరాములు, యాదయ్య, శివ, రఘు, రవియాదవ్, శ్రీను, శేఖర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
