క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే మందుల సామెలు

క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే మందుల సామెలు

తుంగతుర్తి, వెలుగు: క్రైస్తవుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మందుల సామెలు అన్నారు.  బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్టమస్ అన్నారు.

ఏసు ప్రభు బోధనల స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మత పెద్దలు, తహసీల్దార్లు దయానందం, హరిప్రసాద్, శ్రీనివాసరావు, ఎంపీడీవో శేషు కుమార్, సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.