తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్..!

తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్..!

తెలంగాణ కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ ను తీసుకునే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం అజారుద్దీన్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మైనార్టీ వర్గం నుంచి ఇప్పటి వరకు ఎవరూ కేబినెట్ లో లేరు. అజారుద్దీన్ చేరికతో ఇది భర్తీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ప్రస్తుతం కేబినెట్ లో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.

గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మంత్రి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2025, అక్టోబర్ 31వ తేదీన మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.