జూబ్లీహిల్స్ లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం.. నవీన్యాదవ్తో అజారుద్దీన్

జూబ్లీహిల్స్ లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం..  నవీన్యాదవ్తో అజారుద్దీన్

జూబ్లీహిల్స్​, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్ నగరంలోని ముఖ్య నాయకులను కలిసి మద్దతు కోరుతున్నారు. ఆదివారం బంజారాహిల్స్​లో మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్​ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నవీన్​యాదవ్​కు అజారుద్దీన్  శుభాకాంక్షలు తెలిపారు. 

జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామన్నారు. అనంతరం ఎర్రగడ్డ కల్యాణ్ నగర్​లో తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డితో కలిసి కాలనీ మీటింగ్​లో నవీన్ యాదవ్ పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.