ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రైవేటు హాస్టల్లో ఉరేసుకొని బీటెక్ స్టూడెంట్ చనిపోయాడు. గురునానక్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న కందిమల్ల సాయి (20) ఇబ్రహీంపట్నంలోని దివ్య రెడ్డి బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడిని సూర్యాపేట జిల్లా శ్రీరంగపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
