వికారాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్లో ఈ నెల 27న జరిగే మాలల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బి.వెంకటేశ్ కోరారు. వికారాబాద్లోనిఅంబేద్కర్ విగ్రహం వద్ద సభ వాల్ పోస్టర్ను సోమవారం రిలీజ్ చేశారు.
మాలల ఆత్మ గౌరవ సభకు జిల్లా నుంచి మాలలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బి.రాజు, అధికార ప్రతినిధి ఆర్. రాములు, ప్రధాన సలహాదారులు వసంత్ కుమార్, ప్రేమ్ కుమార్, సోషల్ మీడియా ఇన్ చార్జి ఎల్. శ్రీనివాస్ పాల్గొన్నారు.