Coldplay concert : కోల్డ్‌ప్లే కచేరీ క్లిప్ వైరల్.. అదిరిపోయే మీమ్‌తో 'బాహుబలి' టీమ్ ఎంట్రీ!

Coldplay concert : కోల్డ్‌ప్లే కచేరీ క్లిప్  వైరల్..  అదిరిపోయే మీమ్‌తో 'బాహుబలి' టీమ్ ఎంట్రీ!

'బహుబలి' ( Baahubali )  విడుదలై దశాబ్దం అయింది. ఇటీవలే దీనికి సంబంధించిన వేడుకను చిత్ర బృందం జరుపుకుంది. ఈ నేపథ్యంలో మొదటి, రెండో భాగాలను కలిపి అక్టోర్ 31న థియేటర్లతో రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  ఇలాంటి సమయంలో కోల్డ్‌ప్లే కచేరీలో ఆస్ట్రోనమర్ CEO ఆండీ బైరాన్, HR హెడ్ క్రిస్టిన్ కాబోట్‌ల వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కెమెరా కంటికి చిక్కకుండా దాక్కోవడానికి ప్రయత్నించిన ఈ జంటకు బంధించిన వీడియో క్లిప్ పై పుకార్లు షికారు చేస్తున్నాయి.  సోషల్ మీడియాలో మీమ్‌ల సునామీని సృష్టించింది. ఈ ట్రెండ్‌లో ఇప్పుడు మన 'బాహుబలి' టీమ్ కూడా చేరింది. తమదైన మార్క్ హాస్యంతో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.

మాహిష్మతి CEO & HR.. 
ఆ కోల్డ్‌ప్లే కచేరీ వీడియోలో, ఆండీ బైరాన్, క్రిస్టిన్ కాబోట్ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకుంటూ కనిపించారు. దీనికి 'బాహుబలి' నిర్మాతలు తమ బ్లాక్‌బస్టర్ చిత్రం నుండి ప్రభాస్ (అమరేంద్ర బాహుబలి), అనుష్క శెట్టి (దేవసేన) కౌగిలించుకున్న ఒక ఐకానిక్ ఫోటోను పంచుకున్నారు. "మాహిష్మతి CEO & HR" అనే క్యాప్షన్‌తో ఈ చిత్రాన్ని పోస్ట్ చేయగానే ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఈ మీమ్ క్షణాల్లో వైరల్ కావడంతో, అభిమానులు బాహుబలి టీమ్ హాస్యాన్ని ఆకాశానికి ఎత్తేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Baahubali (@baahubalimovie)

 

నవ్వులు పూయిస్తున్న నెటిజన్ల సరదా కామెంట్లు.. 
ఈ క్లిప్ పై నెటిజన్లు సరదాగాతమదైన శైలిలో స్పందించారు. అడ్మిన్, మీరు ఎవరైనా సరే, ఐ లవ్ యు అని ఒకరు ప్రేమను చాటుకుంటే, మరొకరు మరింత ముందుకెళ్లి, మరికొన్ని రోజులు వేచి ఉండండి, రాజమాత CEOను తన ఇంట్లో నుండి తరిమివేయవచ్చు" అంటూ చమత్కరించారు. ఇంకొక అభిమాని అయితే టైటానిక్ బాహుబలి అని రాసి నవ్వులు పూయించారు. అడ్మినిస్ట్రేషన్ శివగామి... అంటూ మరో యూజర్ చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. 'బాహుబలి' టీమ్ చూపిన ఈ చతురత సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.

కోల్డ్‌ప్లే ఫ్రంట్‌మ్యాన్ స్పందన  కంపెనీ ప్రకటన
ఆండీ బైరాన్, క్రిస్టిన్ కాబోట్ వైరల్ మూమెంట్‌పై కోల్డ్‌ప్లే ఫ్రంట్‌మ్యాన్ క్రిస్ మార్టిన్ కూడా కచేరీలోనే స్పందించారు. ఈ జంట కెమెరాలకు దొరక్కుండా ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి, మేము ఏదైనా తప్పు చేశామా అని ఆశిస్తున్నాను. వారు అఫైర్లో ఉన్నారా లేదా వారు చాలా సిగ్గుపడుతున్నారు" అని సరదాగా వ్యాఖ్యానించారు.

 వైరల్ వీడియోతో చెలరేగిన పుకార్లు
అయితే, ఈ వైరల్ వీడియోతో చెలరేగిన పుకార్లు, ప్రజల నుండి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ఆస్ట్రోనమర్ కంపెనీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తమ కంపెనీ విలువలు, నాయకత్వ ప్రమాణాలపై కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. మా వారి ప్రవర్తన, జవాబుదారీతనం రెండింటిలోనూ ప్రమాణాలను నెలకొల్పాలి. డైరెక్టర్ల బోర్డు ఈ విషయంపై అధికారిక విచారణను ప్రారంభించింది, మేము చాలా త్వరలో అదనపు వివరాలను పంచుకుంటాము" అని పేర్కొంది. ఆండీ బైరాన్ కూడా తన కుటుంబం, స్నేహితులు , సహోద్యోగులకు రాసిన క్షమాపణ లేఖలో గోప్యతను కోరారు.

'బాహుబలి' రీ-రిలీజ్ హంగామా
ఇదిలా ఉండగా, 'బాహుబలి' చిత్రం విడుదలై దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ విజువల్ వండర్‌లోని మొదటి, రెండవ భాగాలను అక్టోబర్ 31న థియేటర్లలో తిరిగి విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ రీ-రిలీజ్ వార్త అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరోసారి ఈచిత్రాన్ని వెండితెరపై చూసేందుకు వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' టీమ్ సోషల్ మీడియాలో చూపిన ఈ హాస్యం, వారి రాబోయే రీ-రిలీజ్‌కు ఖచ్చితంగా మరింత ప్రచారాన్ని తీసుకురావడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.  ఈ సరదా మీమ్‌లు సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచాయి.