దర్శకధీరుడు ఎస్ .ఎస్ .రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎంతటి రికార్డులు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచ వ్యాప్తంగా సాటిచెప్పింది. అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ మరో సారి థియేటర్లలో సందడి చేయనుంది. తొలి భాగం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా, మేకర్స్ 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఈ రెండు భాగాలను కొత్తగా ఎడిట్ చేసి, సాంకేతికంగా మెరుగుపరచిన ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
'బాహుబలి: ది ఎపిక్' రిలీజ్ సందర్భంగా ప్రభాస్, రానా, రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూలో పొల్గొన్నారు. షూటింగ్ కు సంబంధించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇందులో ఫస్ట్ పార్ట్ తో పాటు సెంకడ్ పార్ట్ కి సంబంధించిన విషయాలు పంచుకున్నారు. కొన్ని సీన్స్ కట్ చేసినట్లు తెలిపారు. లేటెస్ట్ గా ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫుల్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ఈ 'బాహుబలి: ది ఎపిక్' చిత్రం భారతదేశంలో అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది. అయితే, అమెరికా మార్కెట్‌లో మాత్రం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రెండు రోజుల ముందే, అక్టోబర్ 29నే ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. మహిష్మతి , కుంతల రాజ్యాల వైభవాన్ని, ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి దిగ్గజాల అద్భుత ప్రదర్శనను ఈ సరికొత్త రూపంలో మళ్ళీ చూసేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ 'ది ఎపిక్' వెర్షన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, ఇది కేవలం రీ-రిలీజ్ కాదని, రాజమౌళి చేస్తున్న ఒక కొత్త ప్రయోగం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు .
'బహుబలి' తొలి భాగం రిలీజ్ టైమ్ లో 4DX , IMAX వంటి సౌకర్యాలు లేవు. కానీ ఇ ప్పుడు ఈ రెండు భాగాలను కలిపి , ఇతర ప్రీమియం లార్జ్ ఫార్మట్ లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్.. ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు 'బహుబలి' ని చూశారు. పదేళ్ల క్రితం థియేటర్లలో చూసిన వాళ్లు కూడా ఇప్పుడు ఈ చిత్రాన్ని మరో సారి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఇప్పుడు వారు కోరుకున్నట్లుగానే ఒక లార్జర్ దాన్ లైఫ్ అనుభూతిని థియేటర్లలో చూసేలా తీర్చిదిద్దామని వెల్లడించారు.
