బాబ్రీమసీదు కేసులో 30న తుది తీర్పు: హాజరుకావాలని అద్వానీ, జోషీలకు కోర్టు ఆదేశం

బాబ్రీమసీదు కేసులో 30న తుది తీర్పు: హాజరుకావాలని అద్వానీ, జోషీలకు కోర్టు ఆదేశం

బాబ్రీ మసీదు కేసులో ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తుది తీర్పును వెలువరించనుంది. ఈ క్రమంలో ఈ కేసులో నిందితులైన బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలు తప్పకుండా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1992 నాటి మసీదు కూల్చివేత ఘటనలో వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గత జూలై 24న అద్వానీ స్టేట్మెంట్ ను ప్రత్యేక సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేసింది. విచారణలో తాను ఏ తప్పు చేయలేదని అద్వానీ చెప్పారు. మరోవైపు విచారణ తర్వాత ఉమా భారతి స్పందిస్తూ తనకు ఎలాంటి శిక్ష పడినా అనుభవించడానికి సిద్ధమేనని అన్నారు. మరోవైపు కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వనుందోనని పలు రాజకీయపార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.