
అమ్మాయిల హాస్టల్ లోకి వెళ్లి గొడవ చేసిన గ్యాంగును పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరులోని గ్రీన్ హౌస్ లేడీస్ హాస్టల్ లో మంగళవారం రాత్రి బాబు అనే అతను తన గ్యాంగుతో కలిసి గొడవకు దిగారు. హాస్టల్ డోర్ తెరువవలసిందిగా వార్డెన్ తో గొడవ పెట్టుకున్నాడు. హాస్టల్ లో ఉన్న అమ్మాయిలను తమతో పార్టీకి పంపాలని గొడవ చేశారు. అర్దరాత్రి హాస్టల్ లో ఉన్న అమ్మాయిలను బయటకు పంపడం కుదరదని హాస్టల్ యజమాని జగన్ రెడ్డి చెప్పాడు.
దీంతో.. బాబు అతని గ్యాంగు హాస్టల్ డోర్ ను విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. డోర్ ముందున్న పూల కుండీలను పగులకొట్టారు. దీంతో బయపడిన జగన్.. డోర్ తీసేసరికి అతని పై దాడి చేశారు.. జగన్ కు తీవత్రగాయాలయ్యాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న జగన్ తమ్ముడు భాస్కర్ రెడ్డి, అతని ఫ్రెండ్ అనిల్ వారిని ఆపడానికి ప్రయత్నించారు. అయితే జగన్ కు చెవుల నుంచి రక్తం కారుతుండటంతో.. బయపడిన బాబు అతని గ్యాంగు పారిపోయారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా బాబును గురువారం పట్టుకుని కేసునమోదు చేశారు. విషయం లేటుగా బయటకు వచ్చింది.