ఎంపీ పదవికి  బాబుల్ సుప్రియో రాజీనామా

ఎంపీ పదవికి  బాబుల్ సుప్రియో రాజీనామా

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో ఇవాళ(సోమవారం) తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (TMC)లో చేరారు. అభిషేక్‌ బెనర్జీ సమక్షంలో సుప్రియో TMC కండువా కప్పుకున్నారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పుల తర్వాత సుప్రియో బీజేపీని వీడారు. అయితే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రకటించిన సుప్రియో.. TMC చేరడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరచింది.

పశ్చిమ బెంగాల్ లో చెందిన బాబుల్.. బీజేపీ ఎంపీగా గెలిచారు.  తర్వాత  కేంద్ర మంత్రి అయ్యారు. అయితే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత  త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.  ఆ తర్వాత  TMCలో చేరారు. తృణ‌మూల్‌లో చేరిన‌ప్ప‌టికీ ఎంపీగా కొన‌సాగుతున్నారు. బీజేపీ గుర్తుతో గెలిచిన ఆయన.. ఎంపీగా కొన‌సాగకూడదని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. రాజీనామా లేఖ‌ను రేపు (మంగళవారం) పార్ల‌మెంట్ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి స‌మ‌ర్పించ‌నున్నారు.  బాబుల్ సుప్రియో రాజీనామా చేస్తే అమోదం పొందితే.. ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.