
హైదరాబాద్: గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు దారుణ హత్యకు గురైన చిన్నారి అధ్య మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం జరగలేదు. ఇదే విషయంపై బంధువులు అడిగితే ఉస్మానియా హాస్పిటల్ లో డాక్టర్లు అందుబాటులో లేరని సిబ్బంది చెబుతున్నారు. దీంతో చేసేదేమీలేక హాస్పిటల్ దగ్గరే పడిగాపులు గాస్తున్నారు కుటుంబ సభ్యులు. పోస్టుమార్టం త్వరగా చేసి, చిన్నారిని అప్పగించాలని కోరుతున్నారు అధ్య కుటుంబ సభ్యులు. నిందితుడు కరుణాకర్ కు చికిత్స అందిస్తున్న పోలీసులు..ఇప్పటికే అధ్య తల్లి అనూష స్టేట్ మెంట్ తీసుకున్నామని తెలిపారు.