
- షాద్నగర్లో దారుణం
షాద్నగర్, వెలుగు: మురుగు కాల్వలో పసికందు మృతదేహం దొరికిన ఘటన షాద్నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలోని మురుగు కాల్వలో పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శిశువును కాల్వ నుంచి బయటికి తీశారు.
బాబు పుట్టిన కొన్ని గంటలకే గుర్తు తెలియని వ్యక్తులు కాల్వలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు ఫైల్ చేశామని, పసికందును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. కాల్వలో ఎవరు పడేశారనే వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు.