భద్రాద్రిలో బాల భీముడు జననం

భద్రాద్రిలో బాల భీముడు జననం

భద్రాచలం,వెలుగు :భ ద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గురువారం బాల భీముడు పుట్టాడు. 5 కిలోల బరువుతో జన్మించిన శిశువును చూసి వైద్య సిబ్బంది, పలువురు ఆశ్చర్యపోయారు. మణుగూరు టౌన్ కు చెందిన జోగునూరు రాణికి పురిటినొప్పులు రావడంతో భర్త బాబు స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ఆమెకు షుగర్​లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రెఫర్​ చేశారు.

 ఆస్పత్రి సూపరింటెండెంట్​డాక్టర్ ముదిగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్టులు మెడికల్ టెస్ట్ లు చేసిన  అనంతరం గురువారం రాణికి సిజేరియన్​ద్వారా  కాన్పు చేశారు. పుట్టిన శిశువును పరీక్షించగా 5 కిలోల బరువు ఉన్నాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంతో ఉన్నారని సూపరింటెండెంట్ తెలిపారు.