డెలివరీ ఆలస్యం.. శిశువు మృతి

డెలివరీ ఆలస్యం.. శిశువు మృతి

భైంసా, వెలుగు: డాక్టర్లు డెలివరీ ఆలస్యం చేయడంతో నిర్మల్​జిల్లా భైంసాలో శిశువు మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలం నగర్ గ్రామానికి చెందిన రజిత నిండు గర్భిణి. ఆదివారం సాయంత్రం పురుటి నొప్పులు మొదలవడంతో కుటుంబ సభ్యులు భైంసా ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిజేరియన్​చేయాలని డాక్టర్లను కోరగా, నార్మల్​డెలివరీ అవుతుంది.. కొద్దిసేపు ఆగుదామని చెప్పారు. 

అర్ధరాత్రి12 గంటలు తర్వాత నార్మల్ డెలివరీ చేశారు. పుట్టిన బిడ్డ కొద్దిసేపటికే చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని రజిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.కాశీనాథ్ ను వివరణ కోరగా.. నార్మల్ డెలివరీ చేసేందుకు ప్రయారిటీ ఇచ్చిన మాట నిజమేనని, అయితే తల్లి కడుపులోనే బిడ్డ మెడకు పేగు చుట్టుకోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుందని, డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు.