బేబీ దెబ్బకి అర్జున్ రెడ్డి రికార్డ్స్ ఔట్.. జస్ట్ రెండు వారాల్లో

బేబీ దెబ్బకి అర్జున్ రెడ్డి రికార్డ్స్ ఔట్.. జస్ట్ రెండు వారాల్లో

బేబీ(Baby) సినిమాకు తెలుగు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ సినిమా కలెక్షన్స్ గురించే చర్చ. సినిమా విడుదలై రెండు వారాలవుతున్నా కలెక్షన్స్ లో ఊపు మాత్రం అస్సలు తగ్గడంలేదు. వర్షాలను సైతం లెక్కచేయకుండా.. ఈ సినిమాను చుడటానికి ఎగబడుతున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కెలెక్షన్స్ రాబడుతోంది.

ఇక తాజాగా ఈ సినిమా విజయ్ దేవరకోండ(Vijay devarakonda) హీరోగా వచ్చిన కల్ట్ మూవీ అర్జున్ రెడ్డి(Arjun reddy) లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది. అది కూడా రెండు వారాలు పూర్తవకుండా. అర్జున్ రెడ్డి మూవీ లాంగ్ రన్ లో రూ.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఆ రికార్డ్ ను కేవలం 11 రోజుల్లో కలెక్ట్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది బేబీ సినిమా. ఇక బేబీ సినిమా 12 రోజులకు గాను మొత్తంగా రూ.73 కోట్ల గ్రస్ ను రాబట్టింది. 

ఒక చిన్న సినిమా అదికూడా కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం అంటే మాములు విషయం కాదు. ఇప్పుడున్న చాలా మంది స్టార్ హీరోలు సైతం ఈ కలెక్షన్ రాబట్టలేక చతికిల పడుతున్నారు. అలాంటిది బేబీ సినిమా ఈ రేర్ రికార్డ్ సాధించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక జులై 28న పవన్(Pawan) హీరోగా వస్తున్న బ్రో(Bro) మూవీ రిలీజ్ కానుంది కాబట్టి బేబీ సినిమా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందనే చెప్పాలి. ఒకవేళ బ్రో మూవీ కాస్త అటూ ఇటైనా.. బేబీ సినిమా కలెక్షన్స్ మళ్ళీ పుంజుకోవడం ఖాయం.