OTTలోనూ బేబీని కోటి మంది చూశారంట...!

OTTలోనూ బేబీని కోటి మంది చూశారంట...!

ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnawi chaitanya), విరాజ్ అశ్విన్(Viraj ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లవ్ అండ్ యూతుఫుల్ ఎంటెర్టైనర్ బేబీ(Baby). కలర్ ఫోటో సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న రచయిత సాయి రాజేష్(Sai rajesh) ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. బేబీ మూవీని రూ.7కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా..ఏకంగా రూ.92 కోట్ల కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. చిన్న బడ్జెట్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా బేబీ నిలిచింది.

ఇక రీసెంట్గా OTT లో రిలీజ్ చేసిన బేబీని..ఏకంగా కోటి మంది చూశారంట. థియేటర్స్ లోనే కాకుండా OTT లోను తన సత్తా  చాటుతుండటంతో..బేబీ మూవీ మేకర్స్ ని సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ  మూవీ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ అయిన కేవలం 32 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించడంతో మేకర్స్ చాలా హ్యాపీ గా ఉన్నారంట. దీంతో బేబీ మూవీ రానున్న రోజుల్లో ఓటీటీలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేయబోతోందని సినిమా క్రిటిక్స్ తెలుపుతున్నారు. 

బేబీ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది.ఈ సినిమాలో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అంతేకాదు సినిమా సక్సెస్ లో క్రెడిట్ కూడా ఎక్కువ వైష్ణవికే దక్కింది. అందుకే బేబీ సినిమా తరువాత టాలీవుడ్ నుండి ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.  

అలాగే ఈ మూవీ రిలీజ్ టైంలో..సినిమా కంటెంట్ గురించి చాలా రకాల కామెంట్స్ వినిపించాయి.ఎక్కడ కూడా వెనుకడుగు వేయని ప్రొడ్యూసర్,డైరెక్టర్ బేబీ మూవీ విషయంలో తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు.ఈ మూవీలో నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తనలు కీలక పాత్రల్లో నటించిన ఈ యూత్‌ఫుల్ డ్రామాను SKN నిర్మించారు.