చెత్త కుప్పలో పసిపాప.. ట్రీట్​మెంట్ పొందుతూ మృతి

చెత్త కుప్పలో పసిపాప.. ట్రీట్​మెంట్ పొందుతూ మృతి
  •  వైకల్యంతో పుట్టడంతోనే వదిలి వెళ్లిన కన్నవారు

పద్మారావునగర్, వెలుగు: వైకల్యంతో పుట్టిన ఆడ బిడ్డను కొందరు చెత్త కుప్పలో పడేస్తే.. నిలోఫర్ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ఆ పసిపాప చికిత్స పొందుతూ చనిపోయిందని చిలకలగూడ ఎస్​ఐ కిశోర్ తెలిపారు. ఈ నెల 14న గాంధీ హాస్పిటల్ వెనుక గేటు వైపు ఉన్న రోడ్డు మీద వెళ్తున్న మహిళకు పసిపాప ఏడుపు వినిపించింది. చెత్తకుప్ప మధ్య దాదాపు 45 రోజుల పసికందును గుర్తించిన ఆమె.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. 

వారు పసిపాపను నీలోఫర్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. ట్రీట్​మెంట్ పొందుతూ.. ఆ చిన్నారి చనిపోయింది. పసికందు డెడ్​బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిశోర్ తెలిపారు. చిన్నారి తల సాధారణం కంటే పెద్దదిగా ఉండటంతోనే కన్నవాళ్లు రోడ్డుపక్కన వదిలి వెళ్లినట్లు భావిస్తున్నారు.