ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకోను

ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకోను

‘బేబీ’ సినిమాతో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఓవర్​నైట్​ సెన్సేషన్​గా మారింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఈ ట్రయాంగిల్​ లవ్​ స్టోరీ యూత్కు ఏ రేంజ్లో కనెక్ట్​ అయ్యిందో తెలిసిందే. 

అయితే, రియల్​ లైఫ్లో ఈ సినిమాలో ఉన్న హీరోల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎవరిని సెలక్ట్​ చేసుకుంటారు అనే ప్రశ్నకు ఈ నటి ఇంట్రెస్టింగ్​ సమాధానం చెప్పింది. తాను ఆనంద్​ దేవరకొండ, విరాజ్​ ఇద్దరినీ తాను పెళ్లి చేసుకోలేనని తెలిపింది. కానీ, వారిలో కొన్ని క్వాలిటీస్​ తనకు నచ్చుతాయని చెప్పింది.ఇక సినిమాలో వైష్ణవి పాత్ర అలా చేయడం మీకు ఎలా అనిపించింది? అనే ప్రశ్నకు తనదైన స్టైల్​లో సమాధానం ఇచ్చింది. ఇది తప్పు, ఇది కాదు అని మనం నిర్ణయించలేం. ఆ పాత్ర ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించింది అంటూ వైష్ణవి తెలిపింది.

బేబి సినిమాలో వైష్ణవి అద్భుతంగా నటించినా కూడా ఆఫర్లు మాత్రం రావడం లేదని సమాచారం. ఆమెను దర్శక నిర్మాతలు అప్రోచ్ అవ్వడం లేదని తెలుస్తోంది.