
నారాయణఖేడ్, వెలుగు: అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ పక్కన ఉన్న ముళ్లపొదల్లో నుంచి శుక్రవారం మధ్యాహ్నం పసి పాప ఏడుపు వినిపించింది. స్థానికుల సమాచారం మేరకు సిర్గాపూర్ ఎస్సై నారాయణ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. చెట్టు కింద పాప ఏడుస్తూ ఉండడాన్ని గమనించి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పాపను సంగారెడ్డి ఐసీడీఎస్ కు అప్పగించనున్నట్లు ఎస్సై చెప్పారు.