గడువులోపే ఫ్లాట్ల డెలివరీ.. ప్రాజెక్టుల ఆలస్యంపై బాచుపల్లి వాసవి గ్రూపు వివరణ

గడువులోపే ఫ్లాట్ల డెలివరీ.. ప్రాజెక్టుల ఆలస్యంపై బాచుపల్లి వాసవి గ్రూపు వివరణ

హైదరాబాద్​, వెలుగు: రియాల్టీ సంస్థ వాసవి ఇన్​ఫ్రాకాన్​ హైదరాబాద్​ బాచుపల్లిలోని అర్బన్ ప్రాజెక్ట్‌‌‌‌ ఆలస్యంపై కస్టమర్లు ఆందోళన చేయడంపై వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులోని ఫ్లాట్లను హామీ ఇచ్చిన గడువులోపే కస్టమర్లకు అందజేస్తామని ప్రకటించింది. కొన్ని బ్లాకులకు వచ్చే ఏడాది, మరికొన్నింటికి 2027లో, ఎనిమిదో బ్లాకుకు 2028లో జీహెచ్​ఎంసీ ఓసీ ఇస్తామని ప్రకటించింది. కరోనా  కేసుల కారణంగా తెలంగాణ రెరా రిజిస్ట్రేషన్​ గడువును వచ్చే ఏడాది ఆగస్టు మూడో తేదీ వరకు వరకు పొడిగించిందని పేర్కొంది. 

‘‘నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. చాలా బ్లాక్‌‌‌‌లు చివరి దశలో ఉన్నాయి. బ్లాక్-–9 నిర్మాణం మొత్తం పూర్తయింది. బ్లాక్–-8 న్యాయపరమైన కేసుల వల్ల ఆలస్యమైంది.  ఆలస్యానికి పరిహారంగా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రతి ఫ్లాట్‌‌‌‌కు నెలకు రూ.ఏడు వేలు చెల్లిస్తున్నాం” అని తెలిపింది.