కెరీర్లో స్పీడ్ పెంచిన ఎన్టీఆర్.. క్రేజీ లైనప్‌తో బ్యాక్‌‌‌‌ టు బ్యాక్ సినిమాలు

కెరీర్లో స్పీడ్ పెంచిన ఎన్టీఆర్.. క్రేజీ లైనప్‌తో బ్యాక్‌‌‌‌ టు బ్యాక్ సినిమాలు

ఇటీవల కెరీర్‌‌లో మరింతగా స్పీడు పెంచారు ఎన్టీఆర్. బ్యాక్‌‌‌‌ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌ తన కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌‌‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ మొదటి వారం నుంచి కొత్త షెడ్యూల్‌‌‌‌ మొదలవబోతోంది. 

జనవరి వరకు ఈ షెడ్యూల్‌‌‌‌ కొనసాగనుంది. ఇప్పటికే షూట్‌ ఆలస్యమవడంతో వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు కంటిన్యూగా డేట్స్‌ ఇస్తున్నాడట ఎన్టీఆర్. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ ఏ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ఓ వైపు త్రివిక్రమ్‌, మరో వైపు నెల్సన్‌‌‌‌ దిలీప్ కుమార్‌లతో ఎన్టీఆర్‌ సినిమాలు చేయాల్సి ఉండగా ఇంకోవైపు ‘దేవర 2’ కూడా సెట్స్‌‌‌‌కు వెళ్లాల్సి ఉంది. వీటిలో ముందుగా కుమారస్వామి పురాణగాథతో త్రివిక్రమ్ తెరకెక్కించిన మైథాలాజికల్ మూవీ ముందుగా పట్టాలెక్కబోతోన్నట్టు సమాచారం. ఆ తర్వాత నెల్సన్‌‌‌‌ సినిమా, దేవర 2 సెట్స్‌‌‌‌కు వెళ్లనున్నాయి.  వీటిలో దేనికదే ప్రత్యేకమైన జానర్ కావడం, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ను డిఫరెంట్‌‌‌‌గా ప్రజెంట్‌‌‌‌ చేసే క్రేజీ లైనప్‌‌‌‌ కావడంతో అంచనాలు పెరుగుతున్నాయి.