అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ ఫణి ప్రదీప్ ధూళిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్‌లైన్. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఫణి ప్రదీప్ మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్.
జాతిరత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలా ఈ సినిమా ఉంటుంది. అనూప్ రూబెన్స్ మంచి సంగీతం అందించగా చంద్రబోస్ అన్ని పాటలకు లిరిక్స్ అందించారు. పాటలన్నీ బాగా వచ్చాయి. ఇటీవల విడుదల అయిన ‘ఇలా చూసుకుంటానే’ పాటకు మంచి ఆదరణ లభించింది. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం’ అని అన్నాడు.
