
హస్తసాముద్రికానికి చాలా మంది ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. హస్తసాముద్రికంలో చేతులపై ఉన్న సన్నని గీతలు, పుట్టు మచ్చలు, డార్క్ స్పాట్స్ చూసి మన భవిష్యత్తును, శుభ ఫలితాలను అంచనా వేయవచ్చు. హస్తసాముద్రికంలో మంచే కాదు చెడు ఫలితాలు కూడా తెలుసుకోవచ్చు. హస్తసాముద్రికం ప్రకారం మీకు చెడు ఫలితాలను ఇచ్చే కొన్ని రేఖలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!
హస్తసాముద్రికం పండితులు తెలిపిన ప్రకారం అర చేతిలో కొన్ని రేఖలు ఉన్నవారు వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వారు జీవితంలో కాలక్రమేణా ఆర్థికంగా కష్టాలు ఉంటాయని... ఎంత కష్టపడినా ఇబ్బందులు పడతారని అంటున్నారు.
ద్వీప బాట : అరచేతిలో ద్వీపం మాదిరిగా.. అంటే పర్వతం మాదిరిగా రేఖలు ఉంటే చాలా అశుభమని అంటున్నారు హస్తసాముద్రికులు. అరచేతిలో పర్వతం మాదిరిగా గీతలు ఉంటే అవి ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తాయి. ఇలా అరచేతిలో ఉంటే గౌరవానికి భంగం కలుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు.. ఉద్యో గ సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు .
క్షితిజ సమాంతర రేఖలు : ఉంగరం వేలుకు అడ్డంగా రేఖలు ఉంటే వారిని దురదృష్టవంతులని రేఖా శాస్త్రంలో ఉందని పండితులు అంటున్నారు. ఇలా రేఖలు ఉన్నవారు ఎంత కష్టపడినా ఉన్నత స్థాయి హోదా రాదట. అంతేకాదు సామాజికంగా పేరు.. ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
విధిరేఖ .. అరచేతిలో మధ్య వేలుకు కింద ఉండే రేఖ. ఈ రేఖపై పుట్టుమచ్చ ఉంటే అశుభమని చెబుతున్నారు. జీవితంలో ఎదురయ్యే అవకాశాలు, కష్టనష్టాలు, భవిష్యత్తు, విజయం, ఆర్థిక స్థిరత్వం వంటి అనేక అంశాలలో ఇబ్బందులు ఉంటాయి. వీటితో పాటు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రేఖ జీవితాంతం ఒకేలా ఉండదని.. మారుతూ ఉంటుందని చెబుతారు