జూన్ 15 నుంచే బడి బాట.. ఆదివారం పుస్తకాలు, స్టేషనరీ కొనుగోళ్లతో బిజీ బిజీగా..

జూన్ 15  నుంచే బడి బాట.. ఆదివారం పుస్తకాలు, స్టేషనరీ కొనుగోళ్లతో బిజీ బిజీగా..

హైదరాబాద్​సిటీ, వెలుగు : వేసవి సెలవుల తర్వాత సోమవారమే స్కూల్స్​తెరుచుకోనున్నాయి. రెండు నెలలు సమ్మర్​హాలీడేస్​లో ఎంజాయ్​చేసిన చిన్నారులు బడిబాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్టూడెంట్స్​వారి తల్లిదండ్రులు పుస్తకాలు, నోట్​బుక్స్, స్టేషనరీ, స్కూల్​బ్యాగులు, టిఫిన్​బాక్స్​లు, వాటర్​బాటిల్స్​కొనుగోళ్ల బిజీలో గడిపారు. 

కోఠి, సుల్తాన్​బజార్​, బేగంబజార్​, సికింద్రాబాద్​జనరల్​బజార్​తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. పుస్తకాలకు ప్రధాన కేంద్రమైన కోఠి, సుల్తాన్​ బజార్​తో పాటు, బేగంబజార్​ తదితర ప్రాంతాలు రద్దీగా మారాయి. అయితే, గత ఏడాది కంటే ఈసారి ధరలు పెరిగాయని, అయినా, కొనక తప్పలేదని పలువురు తల్లిదండ్రులు చెప్పారు.