జూన్‌‌లో బద్మాషులు

జూన్‌‌లో  బద్మాషులు

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధానపాత్రల్లో శంకర్ చేగూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్‌‌‌‌పై బి. బాలకృష్ణ, సి.రామ శంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌‌‌‌కు చక్కని స్పందన లభించింది.  

శనివారం మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్‌‌ చేశారు. జూన్‌‌ 6న థియేటర్స్‌‌కు వస్తోంది.  దీపా ఆర్ట్స్ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ‘‘ఇది మన ఊరి కథ అనేపించేంత సహజంగా ఇందులో పాత్రలు ఉంటాయి. రూరల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూటెడ్ కథ, కథనాలు, ఆర్గానిక్‌‌ కామెడీతో తెరకెక్కించాం.  హిలేరియస్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే నమ్ముతున్నాం’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు.