- బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్
ట్యాంక్ బండ్, వెలుగు: క్రీడలు ఆరోగ్యకరమైన, చైతన్యవంతమైన సమాజానికి మూలస్తంభమని భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ విజేత, పద్మభూషణ్ సైనా నెహ్వాల్ అన్నారు. శరీరాన్ని మాత్రమే కాకుండా మెదడును కూడా అభివృద్ధి చేయడంలో, జీవిత నైపుణ్యాలను పెంపొందించడంలో ఆటలు సహాయపడతాయన్నారు. గుండ్లపోచంపల్లిలోని డీఆర్ఎస్ఐఎస్ క్యాంపస్లో జరిగిన ఇంటర్నేషనల్ స్కూల్ 23వ వార్షిక క్రీడా పోటీల ముగింపు ఉత్సవాలకు సైనా నెహ్వాల్, అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్, చైర్మన్ దయానంద్ అగర్వాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడలు మానవ జీవితంలో ముఖ్య భాగమన్నారు. పాఠశాలలు క్రమం తప్పకుండా క్రీడా పోటీలు, టోర్నమెంట్లు నిర్వహించాలని.. అప్పుడే విద్యార్థులు దేశీయ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధపడతారని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
