
లక్నో: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల విని యోగంపై నిషేధం విధిస్తున్నట్లు బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) వెల్లడించింది. ఇక నుంచి ఆలయ ప్రాం గణంలో వీడియోలు, రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించింది. యూట్యూబర్‌లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు చేసే రీల్స్ లతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఆలయ ప్రాంగణంలోకి ఫోన్లు తీసుకురాకుండా గతంలో చర్యలు చేప ట్టినా ఫలించలేదని వివరించింది. పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీసేలా ప్రస్తు తం కొంతమంది వ్యవహరిస్తున్నారని.. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రయ త్నాలు మొదలుపెట్టామని చెప్పారు. ఇక నుంచి భక్తులు ఫోన్లను భద్రపరుచు కోవడానికి లాకర్ రూమ్‌లను ఏర్పాటు చేస్తామని కమిటీ చెప్పింది.