నల్గొండ జిల్లా కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్.. ప్రస్తుత కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్కు బదిలీ

నల్గొండ జిల్లా కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్.. ప్రస్తుత కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్కు బదిలీ
నల్గొండ, వెలుగు:​ నల్గొండ జిల్లా నూతన కలెక్టర్‌‌గా బడుగు చంద్రశేఖర్​ నియమితులయ్యారు.  సంగారెడ్డి జిల్లా లోకల్​ బాడీస్​అదనపు కలెక్టర్‌‌గా పనిచేస్తున్న ఆయన్ని నల్గొండ కలెక్టర్‌‌గా ప్రభుత్వం నియమించింది.  2018 బ్యాచ్​కు చెందిన ఈయన గతంలో నిజామాబాద్​జిల్లా అడిషనల్​కలెక్టర్​గా పనిచేశారు. ప్రస్తుత కలెక్టర్​ఇలా త్రిపాఠి నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​గా బదిలీ అయ్యారు. 

గతేడాది అక్టోబర్​లో జిల్లాకు కలెక్టర్​గా వచ్చిన ఆమె 14 నెలల పాటు పనిచేశారు. హెల్త్​, ఎడ్యుకేషన్​, వడ్ల కొనుగోళ్లు, ప్రకృతి వ్యవసాయ, మకానా పంట సాగు, ఆయిల్​ఫాంసాగు,  పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు.  వడ్ల కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇందిరమ్మ ఇంటింటి సర్వే నిర్వహించడంలో రాష్ట్రంలో నల్లగొండ జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. 

ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో తొలిసారిగా మోకాళ్ల మార్పిడి చికిత్స ఆపరేషన్​ విజయవంతం చేయడం లో కలెక్టర్​ ప్రత్యేక శ్రద్ధ చూపారు. భవిత సెంటర్లు, మహిళలకు బాటరీలు వంటి అనేక వినూత్న కార్యక్రమాలకు ఇలా త్రిపాఠి శ్రీకారం చుట్టారు.