
హైదరాబాద్, వెలుగు: బ్యాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'అకికి లండన్' అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ బ్రాండ్ పేరుతో లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు, ఫుట్‌వేర్, బెల్టులు వంటివి అందుబాటులో ఉంటాయి. అధిక నాణ్యత గల పదార్థాలను ఉపయోగించి వీటిని తయారు చేశామని, అన్ని హ్యాండ్‌బ్యాగులకు నప్పా లెదర్‌ను వాడామని బ్యాగ్‌జోన్ తెలిపింది. ప్రతి ఉత్పత్తిని నైపుణ్యం కలిగిన కళాకారులు చేతితో తయారు చేస్తారని, ధరలు రూ.15వేల నుంచి రూ.30వేల వరకు ఉంటాయని బ్యాగ్‌జోన్ పేర్కొంది.